మున్సిపల్ కార్మికుల సమస్యలపై చైర్‌పర్సన్‌కు వినతి

01-10-2026 | 07:39pm

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీ(Kagaznagar Municipality)లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా(Municipal Chairperson Shahin Sultana)కు కార్మికులు వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్య, మంచినీటి, విద్యుత్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.

అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్ నిధులను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10వ తేదీలోగా వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యక్షుడు మల్లేష్, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు