దసరాకూ అందని జీతాలు.. కార్యాలయంలోనే కార్మికుల నిద్రలు!

15-10-2026 | 01:47pm

కాగజ్‌నగర్‌, అక్టోబర్‌ 15 (విజయక్రాంతి): సెప్టెంబర్‌ నెల జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్మికులు (Municipal Workers) కార్యాలయ ఆవరణలో నిద్రిస్తూ నిరసన (Protest) తెలిపారు. దసరా పండుగకు కూడా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తి జీతాలు చెల్లించకుండా రూ.5 వేల అడ్వాన్స్‌ మాత్రమే ఇవ్వడం తమకు ఇబ్బందికరంగా మారిందని కార్మికులు తెలిపారు. పెండింగ్‌ వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు.

సెప్టెంబర్‌ నెల పూర్తి వేతనం చెల్లించే వరకు విధులకు హాజరుకాబోమని యూనియన్‌ నాయకులు శంకర్‌, సంజీవ్‌, మల్లేష్‌ స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు