జాతర వాల్ పోస్టర్లు అవిష్కరించిన వైరా ఎమ్మెల్యే
సింగరేణి అక్టోబర్ 15 విజయ క్రాంతి: దసరా సందర్భంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి లో దేవదాయశాఖ(Endowments Department) ఆధ్వర్యంలో జరిగే శ్రీకోటమైసమ్మతల్లి జాతర వాల్ పోస్టర్లను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్(Wyra MLA Maloth Ramdas Naik) గురువారం అవిష్కరించారు.
ఈనెల 20వ తేదిన నుండి ఐదు రోజుల పాటు నిరాటంకంగా జాతర కు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వేలాది భక్తులు విచ్చేసి మొక్కలు తీర్చుకుంటారు. జాతర సందర్భంగా ఏర్పాట్లను ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో కే.వెంకటయ్య లు ఎమ్మెల్యేకు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో జాతరను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.