రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు సిద్ధార్థ పాఠశాల విద్యార్థి
సుల్తానాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి లోని సిద్ధార్థ నేహా పాఠశాలకు(Siddhartha School) చెందిన విద్యార్థి ఈనెల 4 తేదీన జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో(state-level softball competitions) పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి ఈ పోటీలో ప్రతిభ ఆధారంగా ఈనెల 15 నుండి 17 వరకు హన్మకొండలో జరగబోయే 11వ మినీ సబ్ జూనియర్స్ అండర్ 13 విభాగంలో చల్ల లక్ష్మీనారాయణ ఎంపికైనట్లు సిద్ధార్థ విద్య సంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డీ గురువారం తెలిపారు.
విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి విజేతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుస్ఫూర్తి పెంపొందుతాయని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్ధార్థ పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం అభినందనీయమని, వారి ఎంపిక తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పాఠశాలకు జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్య సంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ,మరియు పిఈటి జీవన్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.