మొసలితో బుడ్డోడి ఫైట్.. వీడియో ఇదిగో!
ఓ చిన్న బాలుడు మొసలిని ఎదురించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్గా మారింది. నదిలో ఉయ్యాల కట్టుకుని సరదాగా ఊగుతున్న బాలుడి వద్దకు ఓ మొసలి రావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
నది మధ్యలో ఉయ్యాల ఊగుతున్న సమయంలో నీటిలో ఉన్న మొసలి బాలుడి వైపు వచ్చింది. దాన్ని గమనించిన బాలుడు భయపడకుండా మొసలిని పట్టుకుని నీటిలోకి నెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. సాధారణంగా మొసలిని చూస్తేనే భయపడే పరిస్థితుల్లో, ఆ చిన్నోడు ఏమాత్రం బెదరకుండా వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ (Viral) కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏంటి వీడు.. ఇంత పెద్ద మొసలిని చూసి కూడా భయపడటం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలుడి ధైర్యాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజమైనవేనా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొసళ్లు ప్రమాదకరమైన వన్యప్రాణులు కావడంతో వాటికి దగ్గరగా వెళ్లడం, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు.
Endhi eedu konchem kuda bhayam lekundaa uyyala ugadam 😲 https://t.co/gHlAH4p0Zv
— సాక్షాత్తు దేవుడు ⚠️ (@imRavanSiva) October 15, 2026