రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థి ఎంపిక

25-11-2026 | 05:57pm

కాగజ్‌నగర్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో ఈ నెల 24న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కాగజ్‌నగర్ డీఏవీ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి పీయూష్ కుష్వాహ ప్రతిభ కనబరిచాడు. అండర్-12 విభాగంలో 80, 150 మీటర్ల పరుగుపందెం (Athletics)లో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ నెల 30, డిసెంబర్ 1న నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో (State Level Competitions) పీయూష్ పాల్గొననున్నాడు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంపై పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అంబాదాస్ రావు, పీఈటీ బాలకృష్ణ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గుండం లక్ష్మణ్, కోచ్ విద్యాసాగర్ విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు