చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలి: ఎస్సై విజయ్

28-09-2026 | 08:29pm

బెజ్జూర్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని ఎస్సై విజయ్(SI Vijay) సూచించారు. మండలంలోని సలుగు పల్లి ప్రధాన కూడలి వద్ద పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి, గుడుంబా, నిషేధిత మత్తు పదార్థాల నిల్వ, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.కోడిపందాలు, పేకాట తదితర సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు యువత దూరంగా ఉండి, చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

మరిన్ని వార్తలు