కాగజ్ నగర్ లో దొంగతనం..!

06-10-2026 | 12:05pm

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District)  కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీ నగర్ లో  దొంగతనం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి పట్టణంలోని బాలాజీ నగర్ చెందిన  రిటైర్డ్ టీచర్(Retired Teacher)  తాటి రవీందర్ ఇంట్లో  దొంగలు   ఇంటి వెనుక భాగం నుంచి ఇనుప డ్రిల్లను  తొలగించి, కిటికీ తెరిచి  ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బీరువాలు, బ్రీఫ్ కేసులను   తెరిచి  వస్తువులను   ఇష్టం వచ్చినట్లు పడవేసినారు. తాటి రవీందర్ పెద్ద కుమారునికి కరీంనగర్లో వైద్యం చేయించేందుకు కుటుంబీకులు వెళ్లారు.

ఇదే అదునుగా భావించిన దొంగలు(Thieves) దొంగతనానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున పనిమనిషి  ఇంటి గేటు తెరిచి   లోపలికి వచ్చింది. ఇది గమనించిన పనిమనిషి రవీందర్ ఇంటి పక్కన అతని సోదరుడు తాటి విట్టల్ కు  దొంగతనం గురించి చెప్పింది . దీంతో విటల్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ ఎస్ఐ  వెంకన్న గౌడ్ ఘటన ఘటన స్థలానికి  చేరుకొని దొంగతనం జరిగిన తీరుపై  వివరాలు సేకరిస్తున్నారు. కరీంనగర్లో గల  తాటి రవీందర్ కుటుంబీకులు  ఇక్కడికి వస్తే కానీ... దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాలు  తెలియ రావచ్చు.

మరిన్ని వార్తలు