ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు

28-09-2026 | 07:27pm

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, చట్టపరిధిలో పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు అందించిన ఫిర్యాదులను ఎస్పీ సావధానంగా విన్నారు.

అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, నిర్ణీత సమయంలో చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవడం పోలీసు శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నితికా పంత్ కోరారు.

మరిన్ని వార్తలు