జమలాపురం చెరువుకు గోదావరి జలాలు..

19-10-2026 | 08:37pm

హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ నిర్మలా కుమారి 

ఎర్రుపాలెం అక్టోబర్ 19 (విజయక్రాంతి): జమలాపురం చెరువుకు గోదావరి జలాలు చేరడంతో సర్పంచ్ నిర్మలాకుమారి కోటేశ్వరరావు దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జమలాపురం చెరువు పూర్తిస్థాయిలో ఎండిపోయింది. జమలాపురం చెరువు కింద సాగు చేసుకుంటున్న రైతాంగానికి ప్రధాన వనరు జమలాపురం చెరువు కావడంతో సర్పంచ్ అభ్యర్థన మేరకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆదేశానుసారం జమలాపురం చెరువుకు సోమవారం నాడు గోదావరి జలాలు చేరుకున్నాయి.

గోదావరి జలాలకు స్వాగతం పలికి గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. గోదావరి జలాలు జమలాపురం చెరువుకు చేరడంతో ఈ ప్రాంత రైతాంగం తో పాటు సర్పంచ్ దంపతులు, మండల కాంగ్రెస్ నాయకత్వం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహరావు, బొగ్గుల గోవర్ధన రెడ్డి శ్రీనివాసరెడ్డి, మిరియాల శ్యాం ప్రసాద్, కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు