ఘనపురం గౌడ సంఘం భవనం ప్రారంభం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం గౌడ సంఘం నూతన భవనంను ఘనపురం మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గౌడ సంఘం భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌడ సంఘం అధ్యక్షులు వేముల పరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సంఘ భవనం లో నిర్వహించిన గణపతి హోమం, పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు బద్దం గోపాల్ రెడ్డి, ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల సంజీవ గౌడ్, గౌడ సంఘం నాయకులు వేముల భాస్కర్ గౌడ్, మండల రమేష్ గౌడ్, వేముల రంగయ్య గౌడ్, వేముల రమేష్ గౌడ్, వేముల మైసయ్య గౌడ్, వేముల మహేశ్వర్ గౌడ్, వేముల యాదగిరి గౌడ్, వేముల చంద్రయ్య గౌడ్, వేముల గోవింద రాజు గౌడ్, వేముల శంకర్ గౌడ్, వేముల వినోద్ గౌడ్, కట్కూరి భాను గౌడ్ వేముల జంగయ్య గౌడ్, వేముల కిష్టయ్య గౌడ్, వేముల రవీందర్ గౌడ్, మండల ఉమేష్ గౌడ్, దొంకేన రమేష్ గౌడ్, రామగోని హన్మంతు గౌడ్, వేముల ప్రవీణ్ గౌడ్, వేముల సంపత్ గౌడ్, నాయకులు ననావత్ సురేష్ నాయక్, వడ్త్యా సురేష్ నాయక్ పాల్గొన్నారు.