ఖైరతాబాద్ పోరుకే ‘తొలి బెల్’

29-09-2026 | 05:25am
  1. గ్రేటర్ రేసు ముందుకు ఖైరతాబాద్ ఉపఎన్నిక
  2. ఉప ఎన్నికకు గెజిట్ సైతం జారీ 
  3. మేయర్ పీఠమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Hyderabad Municipal Corporation)(జిహెచ్‌ఎంసి)ఎన్నికల కంటే ముందే నగరంలో మరో భారీ పొ లిటికల్ యుద్ధానికి తెరలేచింది. అనర్హత పి టిష్ప సుప్రీంకోర్టు తీర్పుతో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని కో ల్పోవడంతో, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి(Khairatabad Assembly constituency) ఉపఎన్నిక(By-election) అనివార్యమైంది. దీం తో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల(Greater Hyderabad Election) కంటే ముందే ఖైరతాబాద్ ఉపఎన్నికను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) సిద్ధమవు తోంది.

నవంబర్ 9 తర్వాతే ఉపఎన్నిక షెడ్యూల్(By-election schedule) రావచ్చని ఇప్పటికే పొలిటికల్ సర్కి ల్లో వార్త చక్కర్లు కొడుతుంది. రాష్ట్రంలో ప్ర స్తుతం కొనసాగుతున్న ’స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(Special Intensive Revision) (సర్ ) ఓటర్ల జాబితా సవరణ ప్ర క్రియ ముగిసిన వెంటనే ఖైరతాబాద్ బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా(Voter List) వెలువడనుండగా, ఆ కొత్త ఓటర్ల రికార్డుల ఆధారంగానే పోలింగ్ నిర్వహించనున్నారు. 

తొలుత ఈ సవరణ ముగియగానే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచించినప్పటికీ, సుప్రీం తీర్పుతో ఖైరతాబాద్ ఖాళీగా మారడం వల్ల తాజా రాజకీయ సమీకరణాల్లో మార్పు చోటుచేసుకుంది. 

 గ్రేటర్ ముఖచిత్రానికి ‘ల్యాకట్ టెస్ట్’....

ఆరు నెలల్లో ఖాళీని భర్తీ చేయాల్సిన రాజ్యాంగ నిబంధన ఉండటంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక ఫలితమే రాబోయే జీహె చ్‌ఎంసీ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.అందుకు ఖైరతాబాద్ సీటు చేజారకుండా కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది అధికార పీఠంలో ఉన్న కాంగ్రెస్, ఖైరతాబాద్లో జెండా పాతడం ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాన్ని సునాయాసం చేసుకోవచ్చని భావిస్తోంది. బీజేపీ సైతం ఎన్నికల కు సమరశంఖం పూరిస్తుంది. గ్రేటర్ ఓటర్లలో మంచి పట్టున్న బీజేపీ, ఈ ఉపఎ న్నికను సవాల్గా తీసుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా పటిష్టమైన గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది.

ఇప్పటికే ఖైరతాబాద్ లో ఉప ఎన్నికల రేసులో ఎవరిని దింపాలనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీని దెబ్బతీయాలని అంతిమంగా ప్రజా తీర్పు తమవైపే ఉందంటూ బీఆర్‌ఎస్ సవా ల్ చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. చేజారిన ఖైరతాబాద్ స్థా నాన్ని తిరిగి దక్కించుకుని నగరంలో తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. 

 అసలు లక్ష్యం మేయర్ పీఠమే.....

వార్డుల విభజన, డీలిమిటేషన్ ప్రక్రియ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీ షెడ్యూల్ను ఖరారు చేయనుంది. అయితే, ముందస్తుగా వచ్చే ఖైరతాబాద్ ఉపఎన్నికల ఫలితమే గ్రేటర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో చెప్పే ’దిక్సూచి’గా మారనుంది. దీంతో రాష్ట్రంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ తో పాటు ప్ర తిపక్ష పార్టీ లు బి ఆర్ ఎస్, బిజెపిలకు సవా ల్‌గా మారిందనే చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు