దూసుకొస్తున్న వాయుగుండం

14-11-2026 | 10:12am

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు(Cyclone threat) పొంచి ఉందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో ఈ System వాయుగుండంగా మారవచ్చని, ఈ నెల 19 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశముంది.

ముఖ్యంగా విశాఖపట్నం–మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. తుఫాన్ దిశ, తీవ్రత, Landfall ప్రాంతంపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలు వాతావరణ శాఖ (IMD) అధికారిక సూచనలను గమనించాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో హెచ్చరికలను పాటించాలని సూచించాలి. తాజా Weather Updates ఆధారంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు