సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. హైదరాబాద్లో సందడి!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత్ సమ్మిట్ (Bharat Summit) సమావేశాలతో పాటు గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కార్యక్రమంలో పాల్గొనేలా వారి షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9 గంటలకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల నాయకులతో జరిగే Closed-Door Meetingలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు అమెరికా, యూరప్ దేశాల నాయకులతో నిర్వహించే మరో కీలక సమావేశానికి హాజరవుతారు.
ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్లో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు Gig Workersతో కలిసి Bike Rallyలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు నోవోటెల్లో జరిగే భారత్ సమ్మిట్ ముగింపు వేడుకలు (Valedictory Session)లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అంతర్జాతీయ నాయకులతో చర్చలు, గిగ్ వర్కర్ల సంక్షేమ కార్యక్రమం, బైక్ ర్యాలీతో సీఎం నేటి Schedule బిజీగా సాగనుంది.