సమస్యలపై ప్రజాప్రతినిధుల గళం
గ్రామ సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచులు.
ఎర్రుపాలెం, నవంబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించేందుకు ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి, మిర్చి పంటలకు ప్రభుత్వం వెంటనే Crop Loss Compensation అందించాలని సర్పంచులు, ప్రజాప్రతినిధులు కోరారు. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ Drinking Water Supply సక్రమంగా జరగడం లేదని, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ నిజమైన అర్హులు, పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు చివరి విడత నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ANMలను నియమించాలని సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నర్సింహారావు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను అధికారులు జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.