శ్రీ కాదంబిని డిజైనర్ సారీస్ షోరూం
హైదరాబాద్‌లో ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): కూకట్‌పల్లి నిజాంపేట రోడ్‌లోని బృందావన్ కాలనీలో ‘శ్రీ కాదంబిని డిజైనర్ సారీస్(Sri Kadambini Designer Sarees)’ నూతన షోరూమ్ ప్రారంభమైంది. శుక్రవారం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 123వ డివిజన్ హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సం స్కృతి, సంప్రదాయాల్లో చీరలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తరతరాలుగా వస్తున్న నేత కళను ఆధునిక డిజైన్లతో మేళవించి మహిళల అభిరుచులకు అనుగుణంగా కలెక్షన్లు అందించడం అభినందనీయమని పే ర్కొన్నారు. దేవి ఆలోచన, దార్శనికతతో ప్రారంభమైన ఈ షోరూమ్లో కంచిపట్టు, బనారస్, సంప్రదాయ చేనేత చీరలతో పా టు వివాహాలు, పండుగలు, ఇతర వేడుకలకు అనువైన ప్రత్యేక డిజైనర్ చీరలు అందు బాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.