భావోద్వేగాల రెటీనా
మనీష్, పాయల్ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రెటీనా(Retina)’. అల్లం రాజు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పార్వతి సినిమాస్ బ్యానర్‌పై పార్వతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో మనీష్ మాట్లాడుతూ.. “మా డైరెక్టర్ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ సినిమాతో ఆయన ఇండస్ట్రీలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. టీమ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లా ఈ సినిమా కోసం కష్టపడ్డాం” అన్నారు.
‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది’ అని హీరోయిన్ పాయల్ చెప్పింది. డైరెక్టర్ అల్లం రాజు మాట్లాడుతూ.. “మంచి భావోద్వేగాలతో సాగే చిత్రమిది. నిజ జీవిత సంఘటలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించాం” అని తెలిపారు. నిర్మాత పార్వతి మాట్లాడుతూ.. “రెటీనా ఒక మంచి మూవీ. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు అన్ని హంగులతో, క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా తీసుకొచ్చేందుకు నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా. మా సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు హర్ష ప్రవీణ్‌తో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కూడా మాట్లాడారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.