8 నెలలు గడ్డుకాలమే
- ‘ఎల్‌నినో’తో వర్షాభావ ముప్పు
- కోవిడ్ తరహాలో కరువుపై సమష్టి పోరు
- రెండేళ్లకు సరిపడా ధాన్యం నిల్వలు
- నీటి కొరతే అసలు సవాల్
- మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేది లేదు
- ‘తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్’ కర్టెన్ రైజర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
- పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, సీతక్క
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే ఎనిమిది నెలల పాటు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా అప్రమత్తం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. కోవిడ్ మహమ్మారిని సమష్టిగా ఎదుర్కొన్నట్లే ఎల్‌నినో ముప్పునూ రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ర్టంలో వచ్చే రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలున్నప్పటికీ నీటి లభ్యతే ప్రధాన సమస్యగా మారనుందని హెచ్చరించారు.
హైదరాబా ద్‌లోని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ‘తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మం త్రి సీతక్క, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, పద్మశ్రీ చింతల వెంకట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభా వం కొనసాగుతోందని, ఇప్పటికే నీటి కొరత సమస్యలు ఎదురవుతున్నాయని సీఎం తెలిపారు.
ఒక వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కేవలం రెండు గంటల్లో 24 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే విపరీత వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగి స్తున్నాయన్నారు. నీటి లభ్యతను దృష్టిలో పె ట్టుకుని రైతులు పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని, ఒక పంటను త్యాగం చేస్తే పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉం టుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కు సూచించినట్లు తెలిపారు. పెట్టుబడు లను ఆకర్షించడంతోపాటు ప్రకృ తి వనరు ల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడమే తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్ లక్ష్యమని వివరిం చారు.
మూసీ ప్రక్షాళన ఆగదు
మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసిత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటా యించి ఆదుకుంటున్నామని, ఎవరికీ అన్యా యం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు. తెలంగాణకు జల్, జమీన్, జంగల్ పరిరక్షణలో ప్రత్యేక చరిత్ర ఉందని సీఎం గుర్తు చేశారు. కొమురం భీం ప్రకృతి వనరుల కోసం పోరాడారని, కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప, పాకాల వంటి చెరువులు మన జలవనరుల వారసత్వానికి నిద ర్శనమని చెప్పారు.
గుజరాత్ నమూనాను అనుసరించాల్సిన అవసరం లేదని, మన చరిత్ర నుంచే స్ఫూర్తి పొందుతున్నామని వ్యాఖ్యానించారు. చెరువుల ఆక్రమణల కారణంగానే హైదరాబాద్‌లో వరద సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు. చెరువుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశామని, బతుక మ్మ కుంటతోపాటు హైటెక్ సిటీ సమీపంలోని తమ్మిడికుంటను ఆక్రమణల నుంచి కాపాడామని తెలిపారు. అభివృద్ధి, సంక్షే మం, పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యమిస్తున్నామని సీఎం తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, తాను సీఎంగా ఉన్నంతకాలం తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అధైర్యపడొద్దు : మంత్రి ఉత్తమ్
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కరువు ప్రభావాన్ని ముందుగానే ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్లతో ప్రత్యే క కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే సంక్రాంతి తర్వాత ఐదు నెలలపాటు నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున పనులు చేపట్టి జలవనరుల సంరక్షణ, వ్యవసాయ పరిరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్ ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డిదేనని, కరువు నివారణకు రూ.10 వేల కోట్ల ప్రణాళిక రూపొందించడం కూడా ఆయన ముందుచూపులో భాగమని ఉత్తమ్ తెలిపారు. కరువు నివారణ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, చెరువులు, కాలువల పునరుద్ధరణ, ‘పొలం బాట’ ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు రహదారి సౌక ర్యం, వాగులు, నీటి ప్రవాహ మార్గాల అభివృద్ధి, భూగర్భజలాల పెంపు, మౌలిక వస తుల బలోపేతానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ర్టంలో సౌర, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజీ రంగా ల్లో 6,000 మెగావాట్ల సామర్థ్యానికి టెండ ర్లు ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ‘తెలంగా ణ క్లైమేట్ రెసిలియన్స్ అజెండా 2026-2036’ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ముందస్తు కార్యాచరణ: మంత్రి సీతక్క
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచే ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తాగునీటి అత్యవసర అవసరాల కోసం రూ.150 కోట్ల నిధిని సిద్ధంగా ఉంచామన్నారు. వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా రోజుకు 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుండగా, 2027 మార్చి వరకు 11 కోట్ల పనిదినాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ముందస్తు సన్నద్ధత భేష్ : స్టెల్లా
ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముం దస్తు చర్యలు ప్రశంసనీయమని ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.స్టెల్లా కొనియాడారు. ఎల్‌నినో పరిస్థితులు 2027 మార్చి వరకు ఉండవచ్చని, జూన్ నాటికి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు నీటి వనరులపై ఒత్తిడి అధి క మయ్యే అవకాశముందని హెచ్చరించారు.