కాలినడకన బంగ్లాకు షేక్ హసీనా
విమానం పంపేందుకు నిరాకరించిన ఢాకా
భారత సరిహద్దు నుంచి ఢాకా వరకు మానవహారం
ఢాకా, నవంబర్ 27: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Former Bangladesh PM Sheikh Hasina) భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డిసెంబర్ 16వ తేదీన వెళ్తారని అవామీ లీగ్ ప్రతినిధి సయ్యద్ మొజమ్మిల్ అలీ తెలిపా రు. హసీనా బంగ్లాదేశ్‌కు వచ్చేందుకు విమానం పంపాలనే అభ్యర్థనను ఢాకా తిరస్కరించిందన్నారు. దీంతో ఆమె భారత్ సరిహద్దును కాలినడకన దాటేందుకు సిద్ధంగా ఉన్నారని, లక్షలాది మంది స్వాగతం పలుకుతారని, ఢాకా వరకు ఆమె చుట్టూ మానవహారం ఏర్పాటు చేస్తామని అలీ వివరించారు. షేక్ హసీనా తిరిగి వచ్చే ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. 27, 28 తేదీల్లో దేశవ్యాప్త బంద్‌కు అవామీ లీగ్ పిలుపునిస్తూ ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు పెట్టింది.