‘ఎస్‌ఏపీ’లో 10 వేల ఉద్యోగాల తొలగింపు?
జర్మనీ సంస్థపై బ్లూమ్‌బర్గ్ నివేదిక
బెర్లిన్, నవంబర్ 27: జర్మనీకి చెందిన టెక్ సంస్థ ఎస్‌ఏపీ(SAP) (సిస్టమ్ అనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్) 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఏఐకి అనుగుణంగా సంస్థ పునర్‌వ్యవస్థీకరణకు ఈ చర్య చేపడుతుందని తాజాగా ఆ నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 9 శాతం తొలగింపు ఉండనుందని పేర్కొంది. ఉద్యోగాల కోతలపై ఇంకా చర్చలు పూర్తి కాలేదని పేర్కొంది.
ఏఐ అమలు చేయడంలో భాగంగా ప్రయత్నిస్తుండడం, ఇటీవలే సంస్థ ఎగ్జిక్యూటీవ్ బోర్డును రెండుసార్లు పునర్ వ్యవస్థీకరించారు. దీంతో ఆరుగురు బోర్డు సభ్యులలో ఇద్దరు వైదొలిగారు. దీంతో కోతలు తప్పవని సందేశం పంపినట్లయ్యిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కాగా ఈ నివేదికలోని పేర్కొన్న ఉద్యోగాల కోతలపై సంస్థ స్పందించలేదు. కస్లమర్ల అవసరాలకు తగిన వ్యూహాలను రూపొందిస్తామని, సంస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షించుకుంటామని మాత్రం ఎస్‌ఏపీ పేర్కొంది.