క్రూడ్ ఆయిల్‌లో మంట.. మార్కెట్లలో టెన్షన్

13-10-2026 | 09:33am

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు (Crude Oil Prices) భారీగా పెరిగాయి. సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడవచ్చన్న ఆందోళనలతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 107 డాలర్లకు చేరింది. ఒక్క రోజులోనే బ్రెంట్ క్రూడ్ ధర (Brent Crude) 2.18 శాతం పెరిగింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం, చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొనడం అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

ముడిచమురు ధరల పెరుగుదల (Global Oil Market) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఇంధన ధరలు, రవాణా ఖర్చులపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. అయితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయా అనేది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని వార్తలు