నాలుగో రోజు బతుకమ్మ స్పెషల్.. గౌరమ్మను ఇలా కొలవండి

13-10-2026 | 10:13am

హైదరాబాద్‌: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు (Bathukamma Festival) రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ రోజును ‘నానబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు.

గునుగు, తంగేడు పూలతో బతుకమ్మ

నానబియ్యం బతుకమ్మను గునుగు, తంగేడు పూలతో (Gunugu and Tangedu Flowers) అందంగా అలంకరిస్తారు. నాలుగు వరుసల్లో పూలను పేర్చి బతుకమ్మను రూపొందిస్తారు. పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మ శిఖరంపై గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

గౌరమ్మకు ప్రత్యేక నైవేద్యం

బతుకమ్మ పండుగలో ప్రతి రోజుకు ప్రత్యేకమైన పేరు, ఆచారం, నైవేద్యం ఉంటాయి. నాలుగో రోజు నానబెట్టిన బియ్యాన్ని గౌరమ్మకు సమర్పించడం ఈ పండుగలోని విశిష్ట సంప్రదాయం. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

మరిన్ని వార్తలు