బాల్య వివాహ రహిత గ్రామంగా జంగిలిగొండ

14-11-2026 | 02:33pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ మండలం జంగిలిగొండ గ్రామంలో జాతీయ బాలల దినోత్సవాన్ని (National Children's Day) శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండెల రేణుక అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ (Special Gram Sabha) నిర్వహించారు. గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా (Child Marriage-Free Village) తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ (Child Rights Protection), విద్య, ఆరోగ్యం, భద్రతకు గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కారం, ఎస్సీ కాలనీలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి తీర్మానాలు చేశారు.

అనంతరం బాలబాలికలు బాలల దినోత్సవ ప్రాధాన్యతపై మాట్లాడారు. చిన్నారులు ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిన వెంకటేశ్వర్లు, రత్నపురం సునీత రవి, పంచాయతీ కార్యదర్శి గుగులోతు రాములు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, యువకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, బాలబాలికలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు