కళ్లకు గంతలు కట్టుకొని నిరసన
మహబూబాబాద్,(విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission ) ద్వారా నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత(Job Security) కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె కార్యక్రమంలో భాగంగా శనివారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు వినూత్న తరహాలో నిరసనకు దిగారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం తాము శ్రమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పండగపూట ఇలా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.