రైల్వే వర్క్ షాప్ ఏర్పాటు చేయాలి
ముఖ్యమంత్రితో రైల్వే మంత్రిని కలిపి ఎంపీలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ రైల్వే అభివృద్ధి(Mahabubabad Railway Development)పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Union Railway Minister Ashwini Vaishnaw)ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కలిసి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రైల్వే సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వందే భారత్ మెగా మెయింటెనెన్స్ డిపో, వర్క్ షాప్ మహబూబాబాద్‌లో ఈ మెగా వర్క్ షాప్‌కు త్వరగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని కోరారు.
ఈ వర్క్ షాప్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో 4వ ప్లాట్‌ఫామ్ లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కొత్త ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్, నెక్కొండ, మణుగూరు ప్రాంతాల్లో పలు రైళ్లకు స్టాపులు కల్పించాలని, ప్రయాణికుల అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంపీల విజ్ఞప్తులపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.