జనగామ జిల్లా కోసం జైలుకెళ్లిన పోరాట యోధుడికి ఘన సన్మానం
11-10-2026 | 04:43pm
దళిత రత్న తిప్పారపు విజయ్ ను సత్కరించిన నేతలు
జనగామ అక్టోబర్ 11 (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) 10వ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా సాధన కోసం పోరాటం చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు(Warangal Central Jail) వెళ్లిన దళిత రత్న తిప్పారపు విజయ్ ను ఘనంగా సన్మానించారు. జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy), తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సన్మానించారు. జిల్లా సాధనలో తిప్పారపు విజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.