కష్టాల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం

11-10-2026 | 04:55pm

30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన మంత్రి పొంగులేటి 

కూసుమంచి, అక్టోబర్ 11(విజయక్రాంతి): ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలినోవా ప్రభావంతో(Elinova Effect) చాలా కష్టాల్లో ఉందని, అయినప్పటికీ పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. కూసుమంచి మండలానికి(Kusumanchi Mandal) చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీముబారక్‌ పథకాల కింద  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎస్పీ సునీల్‌దత్‌లతో కలిసి లబ్ధిదారులకు మొత్తం రూ.30,03,480 విలువ చేసే చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ప్రజా పాలన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు 

పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు