ఫ్యాక్స్ సొసైటీ అభివృద్ధిపై ఆశలు

11-10-2026 | 04:51pm

తూప్రాన్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండల ఫ్యాక్స్ సొసైటీ (PACS Society) డైరెక్టర్‌గా నక్కలపల్లి బాలమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిటుకుల మహిపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో డైరెక్టర్‌గా ఎన్నికైనట్లు బాలమణి తెలిపారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ రెడ్డికి, ఫ్యాక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు (Thanks) తెలియజేశారు.

మరిన్ని వార్తలు