గిరిజన గడ్డ అభివృద్ధే లక్ష్యం

11-10-2026 | 04:46pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జల్, జంగిల్, జమీన్ (Jal, Jangal, Zameen) నినాదంతో పోరాటం చేసిన వీరుడు కొమురం భీం పేరు మీద ఏర్పాటు చేసిన జిల్లా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ (Bike Rally) నిర్వహించారు. ఈ ర్యాలీ కొమురం భీం చౌరస్తాకు చేరుకోగా, అక్కడ భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన (Administration) ప్రజలకు మరింత చేరువైందని పేర్కొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రాధాన్యమైన పరిణామమని తెలిపారు. జిల్లా ఏర్పాటుతో పరిపాలనా సేవలు ప్రజలకు చేరువయ్యాయని, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు (Development Programmes) చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు.

గిరిజన ప్రాంతమైన జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు అలిపిన హైమద్, సంజీవ్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు సలాం, వెంకన్న, బాలకృష్ణ, నాయకులు కోవ సాయినాథ్, 

మరిన్ని వార్తలు