గీత కార్మికుడి కుటుంబానికి టీజీవైఎస్ అండ
రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత.
కోనరావుపేటఅక్టోబర్ 11(విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రానికి చెందిన గీత కార్మికుడు లింగపురం వెంకటస్వామి గౌడ్(Geetha worker Lingapuram Venkataswamy Goud) ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తెలంగాణ గౌడ యువజన సంఘం (TGYS) రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) కమిటీ అండగా నిలిచింది. సంఘం తరఫున బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం(Financial assistance) అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అబ్బాసాని సందీప్ గౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బాధిత కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ గౌడ్, జవ్వాజి అరవింద్ గౌడ్, కోనరావుపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి సాయికుమార్ గౌడ్, మండల గౌడ యువ నాయకులు నేరెళ్ల మహిపాల్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, మహేశ్ గౌడ్, మధు గౌడ్, రేవంత్ గౌడ్, విఘ్నేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.