పరిశుభ్ర ఇస్సన్నపల్లే మా లక్ష్యం

11-10-2026 | 04:54pm

భిక్కనూర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో ఆదివారం రోడ్ల శుభ్రత పనులు చేపట్టారు.

గ్రామ సర్పంచ్ మేకల రాములు, ఉపసర్పంచ్ రాజమణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది కలిసి గ్రామం నుంచి పెద్ద చెరువు వరకు రహదారికి ఇరువైపులా ఉన్న పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. పండుగ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పారిశుద్ధ్య పనులు(Sanitation Works) చేపడుతున్నట్లు తెలిపారు.

బతుకమ్మ వేడుకల్లో ప్రజలు సౌకర్యవంతంగా పాల్గొనేలా రహదారులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గ్రామ పరిసరాల పరిశుభ్రతకు(Cleanliness) ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు