'ఓటు చోరీ'కి వ్యతిరేకంగా

11-10-2026 | 04:58pm

భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ చీకటి కార్తీక్ గారి బృందం

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11, (విజయక్రాంతి): రాహుల్ గాంధీ(Rahul Gandhi) పిలుపు మేరకు చేపట్టిన 'చలో ఢిల్లీ' నిరసన కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుండి యూత్ కాంగ్రెస్ శ్రేణులు(Youth Congress cadres) భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివచ్చారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో వారి బృందం ఆదివారం ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.

​అక్కడ వారు జాతీయ నాయకులను కలిసి సంఘీభావం తెలపడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన గళం విప్పారు. రాహుల్ గాంధీ  నాయకత్వంలో యువత హక్కుల పరిరక్షణ కోసం, దేశ సమగ్రత కోసం భద్రాద్రి జిల్లా(Bhadradri District) యూత్ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కార్తీక్  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో అసెంబ్లీ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, ఎడారి ప్రదీప్, చెరుకుపల్లి నరేందర్, పాలకుర్తి సుమిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లి ప్రణయ్, మండల అధ్యక్షులు వంకుడోత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు