అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

30-10-2026 | 10:32pm

భూత్పూర్: అర్హులైన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు నమోదు(MLC Voter Registration) చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(ex-MLA Al Venkat Reddy) ఆదేశాల మేరకు భూత్పూర్ పట్టణంలోని అమిస్తాపూర్ గ్రామంలోని ఆరో వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్సీ ఓటు పై అవగాహన కల్పించారు.

తమ కుటుంబాల్లోని అర్హులైన పట్టభద్రులకు, సహాచరులకు అవగాహన కల్పించి వారిని కూడా ఓటర్లుగా నమోదు చేయించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం నవీన్, ఆశన్న, పవన్, మహేష్, నర్సింలు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు