లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
బాలానగర్: మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు జీవీకే కంపెనీ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరికీ గాయాలయ్యాయి.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగం (Over Speeding), నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.