కరువు మండలం గా ప్రకటించాలని భూత్పూర్ లో బీఆర్ఎస్ ధర్నా
- నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- మాజీ ఎమ్మెల్యే ఆల
భూత్పూర్, అక్టోబర్ 30 : భూత్పూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో(BRS party leaders) కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy) ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలన్నారు.
కరువు పరిస్థితులను గుర్తించి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో వేలాది ఎకరాల్లో రైతులు వేసుకున్న పంటలు నష్టపోయారన్నారు. భూత్పూర్ మండలం తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
యాసంగిలో రైతులు సాగు చెయ్యొద్దు, నీళ్లు, కరెంటు అడగొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నారని వ్యవసాయం చేసుకునేవాళ్లు ఎట్లా బతకాలని ఆయన మండిపడ్డారు. కృష్ణ నీళ్లను ఒడిసి పట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జూరాల, కే ఎల్ ఐ ఆయకట్టులో పంటలు ఎండిపోయాయని, అది కేవలం అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి నెలకొంది అన్నారు.
కాలంతో పాటు కాంగ్రెస్ వైఫల్యం వల్ల వచ్చిన కరువు అని ఆయన అన్నారు. అనంతరం భూత్పూర్ చౌరస్తా నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ గౌడ్, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, నారాయణ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, అశోక్ గౌడ్, తూము శ్రీనివాస్ రెడ్డి, రాము రాథోడ్, టౌన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్, సర్పంచులు ఆల శ్రీకాంత్ రెడ్డి, సురేష్, నాయకులు ఫసి, సాకీర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.