రాజ్యాంగ పరిరక్షణకు శ్రామిక వర్గాలు ఏకం కావాలి
సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి
నల్లబెల్లి, నవంబర్ 26( విజయ క్రాంతి ): రాజ్యాంగ పరిరక్షణ(Protection of the Constitution) కోసం దేశంలోని ఉత్పత్తి కులాలు, శ్రామిక వర్గాలు ఐక్యంగా పోరాడాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు(CPI District Council Members) చింతకింది కుమారస్వామి పిలుపునిచ్చారు. 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో సీపీఐ మండల కార్యదర్శి పరికి కోర్నేలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పన్నెండేళ్లుగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు తెరిస్తే సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.సర్పంచి నాగెల్లి జ్యోతి ప్రకాశ్,
సీపీఎం మండల కార్యదర్శి కడియాల మనోహర్, నాయకులు నాగలి శ్రీనివాస్ మాట్లాడుతూ. ఉచితాల మాయలో పడకుండా పేదలు చైతన్యవంతులు కావాలని, కుల, రాజకీయ విభజనలను తిప్పికొట్టి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు మామిళ్ల మోహన్ రెడ్డి, కొనుకటి వీరమల్లు, మామిండ్ల పెద్ద ఐలయ్య, కడియాల క్రాంతికుమార్, బొడిగె సమ్మయ్య, బొద్దుల దశరథం, కనకం కోర్నేలు, రాజు, సుదర్శన్, చిరంజీవి, స్వప్న, రవి తదితరులు పాల్గొన్నారు.