ఇందిరమ్మ బీమా పథకాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలి
26-11-2026 | 06:17pm
తంగళ్ళపల్లి, నవంబర్ 26 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Insurance Scheme) అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 277 కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అర్హులందరూ రేషన్ కార్డు, ఫోన్ నంబర్, నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.