ప్రతి పల్లె అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మహమ్మదాబాద్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) అన్నారు. ఆదివారం మహమ్మదాబాద్ మండలంలోని వెంకట్రెడ్డిపల్లి, మంగంపేట, మంగంపేట తండాల్లో సీసీ రోడ్లు, తాగునీటి బోర్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకుడు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు.రమేష్,మండల అధ్యక్షుడు మూస నరసింహులు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల బీజేపీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,శంకర్ నాయక్, గిరమోని శ్రీనివాసులు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి,కురువ కృష్ణ, వెంకట్రెడ్డిపల్లి సర్పంచ్ కుమ్మరి రామకృష్ణ, ముందలి తండా సర్పంచ్ రాకేష్, కుడుముల రాజు, ముచల సురేష్, చౌదరి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్ రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.