చెన్నూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

18-10-2026 | 10:32pm

చెన్నూర్,  ( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుక ఎంతో అంగరంగవైభవంగా మహిళలు జరుపుకున్నారు. పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం మహిళలు, ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో(devotional), ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, రంగురంగుల పూలతో అలంకరణ చేశారు.

జగన్నాథాలయం ముందు బతుకమ్మ వేదిక కోసం  కౌన్సిలర్  శివక్రిష్ణ  ఆ ప్రాంగణంను విద్యుత్ లైటింగ్ తో   పండుగ  వైభవం ఉట్టిపడేలా  శోభాయమానంగా అలంకరణ చేయించారు.  మహిళలు పెద్ద సంఖ్యలో చేరి  సంప్రదాయ బతుకమ్మ పాటలు,కోలాటాలు, ఆటపాటలతో  ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.

ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు  సంప్రదాయబద్ధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు