సల్కర్‌పేట్‌లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం
13-09-2026 | 01:29am
మట్టి వినాయకుల పంపిణీ.. నూతన మిల్క్ సెంటర్ ప్రారంభం
గండీడ్,(విజయక్రాంతి): మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామం(Salkarpet village)లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ హేమలత పవన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ(Distribution of clay Ganesha idols), నూతన మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి, పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అనంతరం నూతన మిల్క్ సెంటర్‌ను ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.