సకాలంలో నాణ్యమైన యూనిఫాంలు అందించాలి

03-10-2026 | 07:16pm

మహబూబ్‌నగర్, అక్టోబర్ 3: ప్రభుత్వ పాఠశాలల(Government schools) విద్యార్థులకు యూనిఫాంలను(Uniform) నిర్ణీత గడువులోగా కుట్టించి సకాలంలో అందించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudan Naik) అధికారులను ఆదేశించారు. శనివారం యూనిఫాంల కుట్టుపని పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు, నిర్దేశిత కొలతలు పాటిస్తూ కుట్టుపని, పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించి, పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు