పీయూలో రేపు కెమిస్ట్రీ కోర్సు ఓరియంటేషన్
పాలమూరు యూనివర్సిటీ(విజయక్రాంతి): పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) లోని పీజీ కళాశాలలో నవంబర్ 6న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు (Integrated Chemistry Course) ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు (Orientation Programme) హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా కోర్సు ప్రత్యేకతలు, ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగ అవకాశాలపై (Higher Education and Career Opportunities) విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.