కబడ్డీ క్రీడాకారులకు గోల్డెన్ ఛాన్స్!

05-11-2026 | 01:09pm

ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ సబ్‌ జూనియర్‌ బాలుర జిల్లా జట్టు ఎంపిక పోటీలు (Kabaddi Team Selection) ఈనెల 8వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు ఆలేరులోని స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య వెల్లడించారు.

ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 60 కిలోల లోపు బరువు (Weight Limit) కలిగి ఉండాలని, 2010 డిసెంబర్ 13న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ మెమో, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ కార్డు (Age Proof Documents) తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 12, 13, 14 తేదీల్లో వికారాబాద్ జిల్లా యానపల్లిలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో (State Level Championship) యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పూల నాగయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు