దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది
డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్
మహబూబ్నగర్ (విజయక్రాంతి): దైవ భక్తి సన్మార్గం వైపు నడిపిస్తుందని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి(Deputy Mayor Surender Reddy) అన్నారు. బుధవారం నగరం లోని 24వ డివిజన్లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన దుర్గామాత పూజలలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి,మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాక్కిఉద్దీన్తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 24వ డివిజన్ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాధ గోవర్ధన్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.