ఏఐపై అవగాహన సదస్సు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో(Telangana Social Welfare Residential Women’s Degree College) సోమ వారం విద్యార్థులకు "కృత్రిమ మేధస్సు" (Artificial Intelligence – AI), అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, వివిధ రంగాలలో వాటి వినియోగాల గురించి అవగాహన కల్పించారు. ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీ ఎన్. వీరన్న కృత్రిమ మేధస్సు, దాని ఆచరణాత్మక అనువర్తనాల గురించి విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులకు వివిధ AI సాధనాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, వాస్తవ జీవితంలోని సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనే విధానాల గురించి పరిచయం చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సునీత, అధ్యాపకురాలు కె. సరిత, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి (HOD) జిక్రాన్, లలిత, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.