ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్ల పరిశీలన

28-09-2026 | 11:15pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు, బ్లాక్‌స్పాట్లను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హన్నాన్(Mancherial Traffic Inspector Hannan) ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి మంచిర్యాల పట్టణంలోని ఫ్లైఓవర్ వరకు ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు అవసరమైన రక్షణ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి ఇంజినీరింగ్ పనులపై అధికారులు చర్చించారు. మంచిర్యాల ఏఎంవీఐ సూర్యతేజ, మున్సిపాలిటీ ఏఈ దుర్గం మధు, లా అండ్ ఆర్డర్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో శాస్త్రీయమైన ఇంజినీరింగ్ చర్యలు, ట్రాఫిక్ భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, భద్రతా చర్యలకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు