ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు
28-09-2026 | 10:43pm
నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 28 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో గంగాధర్(MPDO Gangadhar) తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్‌చారి, మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం దత్తు, మండల అధికారులు పాల్గొన్నారు.