చికెన్ వ్యర్థాల తరలింపునకు 30న బహిరంగ వేలం

28-09-2026 | 10:32pm

ఖమ్మం రూరల్ (విజయక్రాంతి): ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చికెన్ దుకాణాల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థాలను తరలించే బాధ్యతను అప్పగించేందుకు ఈనెల 30న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి(Municipal Commissioner Alla Srinivas Reddy) తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. టెండర్‌కు దరఖాస్తు చేసుకున్న వారు నిర్ణీత సమయానికి కార్యాలయానికి హాజరై వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

మరిన్ని వార్తలు