ప్రధాన రహదారిపై చెత్త తొలగింపు
చెన్నూర్ రూరల్, నవంబ ర్ 23 : మండలంలోని అక్కేపల్లి పరిధిలోని ప్రధాన రహదారిపై(Main Road) చెత్త(Trash) పేరుకుపోగా ఈ నెల 20న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘ప్రధాన రహదా రిపై చెత్త కుప్పలు - దుర్వాస నతో ప్రయాణికులకు తప్పని తిప్పలు’ పేరి ట ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమ వారం చెన్నూర్ ఎంపీడీఓ అజ్మత్ ఆలీ(Chennur MPDO Ajmat Ali), సర్పంచ్ నక్క కల్పన రాజు, ఉప సర్పంచ్ రాతిపెల్లి రమేష్, పంచాయతీ సెక్రటరీ మహ్మద్ సిరాజ్ లు చెత్త పడేసిన స్థలానికి చేరుకొని పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఇక్కడ పారవేయవద్దం టూ ప్లెక్సీనీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదని, కేటాయించిన స్థలంలోనే వేయాలని సూచించారు.