చెట్ల నరికివేత....రూ.16 వేల జరిమానా

05-11-2026 | 04:52pm

లక్షెట్టిపేట, నవంబర్ 5 ( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేసిన ఘటనలో  నిందితులకు రూ. 16 వేలు జరిమాన విధించినట్లు లక్షేట్టిపేట ఎఫ్ఆర్ఓ సంతోష్(Lakshettipet FRO Santhosh)  తెలిపారు.  వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఆంధ్ర బోర్ లో తిరుపతి అనే వ్యక్తి చెట్లను నరికి అక్రమంంగా కలపను నిల్వ చేశారాన్న విశ్వసనీయ సమాచారం(Reliable information) మేరకు అటవీ శాఖ అధికారులు దాడి చేసి కలపను గుర్తించారు.

నరికివేసిన కలప విలువను రూ.5,412గా అధికారులు నిర్ధారించారు. అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడం చట్టరీత్యా నేరమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు